
పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కా ర్యక్రమాల పురోగతి వివరాలను పోర్టల్‌లో న మోదు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం డీపీవో భిక్షపతి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణతో కలిసి మిషన్ భగీర థ, వ్యవసాయ, పౌర సరఫరాలు, వైద్యారోగ్య, విద్యుత్, హౌజింగ్ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో 2023– 24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను ట్రైనింగ్ మేనేజ్‌మెంట్ పోర్టల్‌లో నమోదు చేసే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీల్లో సాగు విస్తీర్ణం, పంటల వివరాలు, పశువులకు అందుబాటులో ఉన్న పశుగ్రాసం, బ్యాంకు సేవలు, బ్యాంకు మిత్ర, నగదు డిపాజిట్, ఉపసంహరణ సేవలు, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ని ర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలతోపాటు ఇతర వివరాలు నమోదు చేయాలని ఆదేశించా రు. తెల్ల రేషన్‌కార్డులు కలిగిన కుటుంబాల సంఖ్య, కబ్జా నివాస గృహాల వివరాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలపై జరిగిన ఘటనల వివరాలు, వాటి ప్రస్తుత స్థితిగతులు, ఆరోగ్య బీమా కలిగిన కుటుంబాల సంఖ్య, అందుబాటులో ఉన్న నర్సరీలు, సామాజిక పింఛన్ల వివరాలు ట్రైనింగ్ మేనేజ్‌మెంట్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతీ సమాచారం క్లుప్తంగా సేకరించాలని సూచించారు. సమావేశంలో డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.