
ఉద్యమాలకు సిద్ధం కావాలి
● జీవో 49 వ్యతిరేక పోరాట కమిటీ నాయకుల పిలుపు
కాగజ్‌నగర్‌రూరల్: ఆదివాసీలు, ప్రజలను గ్రామా ల నుంచి దూరం చేసే జీవో నంబర్ 49 రద్దుకు సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని జీవో నం. 49 వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగ సంఘ భవనంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన నాయకులు లాల్‌కుమార్, సోయం చిన్నయ్య, ఎండీ చాంద్‌పాషా మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన, గిరిజనేతర ప్రజలకు భద్రత లేదన్నారు. పశువులను మేపడానికి అడవుల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లొద్దని ఫారెస్ట్ అధికారులు అభ్యంతరం చెబుతున్నారని, వంట చెరుకు కోసం వెళ్లనీయడం లేదని ఆరోపించారు. పులుల సంరక్షణ పేరుతో ప్రజల జీ వనాన్ని ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. మెజారీటి ప్రజల ఆమోదం లేనందున జీవో 49 రద్దు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. ఈ నె 21న చేపట్టే బంద్ జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 28న కలెక్టరేట్ ముట్టడి చేపడుతున్నామని, ప్రజలు అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్, తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, భారత్ బచావో ఆందోళన్ రాష్ట్ర అధ్యక్షుడు జాడి ఇన్నయ్య, బీసీ మేధావుల ఫోరం ఉమ్మడి జిల్లా కన్వీనర్ కొండయ్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జయదేవ్ అబ్రహంతోపాటు ప్రజా, ఆదివాసీ సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.