
రుచికరమైన భోజనం అందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని డీటీడీవో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్‌మెట్రిక్ బాలికల వసతిగృహంలో ఆశ్రమ పాఠశాలల వంట సిబ్బందికి గురువారం ఒకరోజు వృత్యంతర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీటీడీవో మాట్లాడు తూ వసతి గృహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. నిర్ణీత సమయంలో విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. కాలం చెల్లిన సామగ్రిని వంటకు విని యోగించొద్దని, వర్షాకాలం దృష్ట్యా నిత్యం ఆహార పదార్థాలను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, ఏటీడీవోలు చిరంజీవి, శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.