
‘ఉమ్మడి జిల్లా బంద్‌కు సహకరించాలి’
ఆదిలాబాద్: జీవో 49 రద్దు చేయాలని కోరుతూ ఈనెల 21న చేపట్టనున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్‌కు సహకరించాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ కోరారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్న జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు, ప్రజాస్వామ్యవాదులు, గ్రామ పటేళ్లు, రాయి సెంటర్ సార్‌మేడీలు, ఆదివాసీ కుల సంఘాలు, వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, ప్రజా సంఘాలు బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం డివిజన్ ఉపాధ్యక్షుడు ఆత్రం గణపతి, నాయకులు వెడ్మ బొజ్జు, ముకుందరావు, పీ. నాగోరావు, గెడం ఆనందరావు, దుర్వ జుగాథిరా వు, ఆత్రం మచ్చేందర్, తదితరులు పాల్గొన్నారు.