
చెరువులో పడి బాలుడు మృతి
దిలావర్‌పూర్: ప్రమాదవశా త్తు చెరువులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెంది న కొప్పుల అశ్విత్ (15) బుధవారం సాయంత్రం ఆడుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రయినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం మండల కేంద్రంలోని కుడి చెరువులో మృతదేహం గమనించిన స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాలకృత్యాల కోసం వెళ్లి చెరువులో జారిపడి మృతి చెందినట్లు అశ్విత్ తల్లి కొప్పుల పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పడి ఒకరి మృతి
భైంసాటౌన్: పట్టణ శివారులోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై నవనీత్‌రెడ్డి తెలిపారు. మండలంలోని వానల్‌పాడ్‌కు చెందిన సిద్దివార్ రమణ (45) పట్టణంలోని కోర్వగల్లిలో నివాసముంటున్నాడు. కుమారుడు రాజుతో కలిసి ఉదయం స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
నిర్మల్‌లో కిడ్నాప్ కలకలం
నిర్మల్‌టౌన్: నిర్మల్‌లో బాలుడి కిడ్నాప్‌కు యత్నం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నిర్మల్ మండలం అనంతపేట్‌కు చెందిన ఐదేళ్ల బాలుడికి తండ్రి కిరాణా కొట్టువద్ద బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి ఇంటికి వెళ్లమని చెప్పాడు. అదే గ్రామానికి వెంట్రుకలు కొనుగోలు చేయడానికి ఆటోలో వచ్చిన ఆరుగురు మహిళలు బాలున్ని ఆటోలో ఎక్కించుకుని వెళ్లారు. బాలుడు ఇంటికి రాకపోయేసరికి కంగారుపడిన తల్లిదండ్రులు అనుమానంతో బంగల్ పేట్ మహాలక్ష్మి వద్ద ఉన్న తెలిసిన వారికి ఫోన్ చేసి విషయం తెలిపారు. అప్పటికే ఆ మహిళలు మహాలక్ష్మి కాలనీకి కొద్ది దూరంలో బాలుడిని దించి వెళ్తుండగా పట్టుకుని నిలదీశారు. తమకేం తెలియదని బుకాయించడంతో వారిపై దాడి చేశారు. అనంతరం మహిళలను పోలీసులకు అప్పగించారు.
పిచ్చికుక్క స్వైరవిహారం
వేమనపల్లి: మండలంలోని జక్కెపల్లిలో గురువారం ఉదయం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఏడుగురిపై దాడి చేసి గాయపర్చింది. అల్లాడి అనసూర్య ఎడమచేయి మణికట్టు వద్ద, ఆలం సాంబయ్య కాళ్లకు, చెన్నూరి బక్కు తల వద్ద, శనిగారపు పోశం కాళ్లకు, తలండి శ్రీనివాస్ చేతులను కొరికింది. చెన్నూరి శేఖర్‌పై పడి కొరికేందుకు ప్రయత్నించగా కర్రతో కొట్టి చంపాడు. జిల్లెడలో కూడా మరో నలుగురిపై దాడి చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆటో సాయంతో వేమనపల్లి పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు.
కుక్క దాడిలో ఇరువురికి గాయాలు
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో కాపువాడకు చెందిన కర్ల కళావతిపై కుక్క దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుక్కలను తరి మేయడంతో ప్రాణాపాయం తప్పింది. రైల్వే స్టేషన్‌కు వెళ్లే మరో ప్రయాణికునిపై కూడా కుక్క దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. బాధితులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే స్టేషన్‌లో కుక్కల బెడద ఉందని ‘సాక్షి’ బుధవారమే కథనాన్ని ప్రచురించింది. అయినా అధికా రులు స్పందించక పోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి రైల్వే స్టేషన్ పరిసరాల్లో కుక్కల బెడదను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

చెరువులో పడి బాలుడు మృతి

చెరువులో పడి బాలుడు మృతి