
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ షురూ
నిర్మల్‌టౌన్: నిర్మల్ పట్టణ శివారులోని కొండాపూర్ వద్ద ఉన్న నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో గురువారం రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాల నుంచి 180మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. గురువారం క్వాలిఫై పోటీలు నిర్వహించగా.. శుక్రవారం నుంచి ఈ నెల 20వరకు ప్రధాన పోటీలు కొనసాగుతాయి. అండర్–19 బాలురు, బాలికలు, సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. జిల్లా క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖేష్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కిషోర్, కో కన్వీనర్, వన్నెల భూమన్న, కోఆర్డినేటర్లు సందీప్, మధుకర్‌గౌడ్, మహేష్, ప్రణీత్, నందకుమార్ పోటీలను పర్యవేక్షించనున్నారు. శుక్రవారం మెయిన్ డ్రా పోటీలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.