
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా అన్నారు. జన్కాపూర్‌లో జన్‌మన్ పథకం కింద రూ.19 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. జెడ్పీ ఉన్న త పాఠశాల విద్యార్థులు ఇంగ్లిష్‌లో రచించిన యంగ్ మైండ్స్ టైమ్‌లెస్ టేల్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 24 మంది విద్యార్థుల ఆలోచనలతో కథలు రాసేలా ప్రోత్సహించిన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లును అభినందించారు. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సహకారంతో నిర్మించిన సంచార సైన్స్ ల్యాబ్‌ను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించారు. ప్రభు త్వ వైద్య కళాశాల విద్యార్థుల వివరాలను ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే కేంద్ర సహా య మంత్రి బృందాన్ని శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీపీవో భిక్షపతి, డీఎంహెచ్‌వో సీతారాం, మాస్టర్ మైండ్స్ కోఆర్డినేటర్ సత్యనారాయణ, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శేషారావు, పంచాయతీరాజ్ ఈఈ కృష్ణ పాల్గొన్నారు.