
వైద్య కళాశాలకు అనాథ మృతదేహం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాలలోని కాలేజ్‌రోడ్‌లో నిర్వహిస్తున్న అనాథ వృద్ధుల, మానసిక దివ్యాంగుల ఆశ్రమానికి మందమర్రిలో నిస్సహాయ స్థితిలో రహదారి పక్కన ఉన్న వృద్ధురాలు(90)కు గత నెల 28 న మందమర్రి ఎస్సై రాజశేఖర్ సూచన మేరకు మేరకు ఆశ్రమంలో చోటు కల్పించారు. సదరు వృద్ధురాలు మంగళవారం తుదిశ్వాస విడిచింది. ఎస్సై సూచన మేరకు మృతదేహాన్ని బుధవారం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించారు. అయినప్పటికీ మృతురాలికి సంబంధించి బంధువులెవరైనా ఉంటే 9701973636 నంబర్‌ను సంప్రదిస్తే మృతదేహం అప్పగిస్తామన్నారు. లేనిపక్షంలో వైద్యకళాశాల వినియోగిస్తుందని ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు ములుకాల కుమార్ తెలిపారు.