
చికిత్స పొందుతూ యువకుడు మృతి
నెన్నెల: ఈ నెల 10న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన మండలంలోని కోణంపేటకు చెందిన దుర్గం రాజేంద్రప్రసాద్ (26) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ రెండేళ్ల క్రితం ప్రైవేట్ ఫైనాన్స్‌లో బొలెరో తీసుకున్నాడు. గిరాకీ లేకపోవడంతో ఈఎంఐలు కట్టలేకపోతున్నానని ఇంట్లో చెప్పుకుని బాధపడుతుండేవాడు. దీంతో మనస్తాపానికి గురై ఇంటివద్ద గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యంకోసం వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని తండ్రి సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై వివరించారు.