
షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు
బెల్లంపల్లి: పట్టణంలోని బజారు ఏరియాలో బుధవారం రాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ తీవ్ర కలకలం రేపింది. నో నేమ్ రెడీమేడ్ షాపు ఎదు ట ఉన్న విద్యుత్ తీగలపై ఒక్కసారిగా మంట లు చెలరేగాయి. కాంటా చౌరస్తా వద్ద నుంచి పాత బస్టాండ్ వైపు వెళ్లే విద్యుత్ తీగలకు మంటలు వ్యాపించడంతో పాదచారులు, వాహనదారులు పరుగులు పెట్టారు. విద్యుత్ శాఖ సి బ్బందికి సమాచారం అందించడంతో సరఫరా నిలిపివేసి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. రెండు తీగలు పరస్పరం తాకడంతో మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. ఈ ఘటన బజారు ఏరియాలో చర్చనీయాంశమైంది.