
ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని..
నేరడిగొండ: కుంటాల బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతు న్న ఓ విద్యార్థిని హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మామడ మండలంలోని వాస్తాపూర్‌కు చెందిన ఆత్రం త్రివేణి (15) ఈనెల 11న శుక్రవారం వాంతులు చేసుకోవడంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం శనివారం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సదరు విద్యార్థిని నెలక్రితం గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమానికి వెళ్లిన సమయంలో గాలిదుమారం వీచింది. దీంతో టెంటు కర్ర ఆమె తలపై పడడంతో గాయాలుకాగా స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించారు. అనంతరం పాఠశాల పునఃప్రారంభం తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది.