
వైద్యానికి కావొద్దు వాగు అడ్డంకి
కెరమెరి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కు మండలంలోని టెమ్లగూడ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. బుధవారం నడుములోతులో నీళ్లు ఉన్నప్పటికీ వైద్యసిబ్బంది వాగుదాటి అ వుతల ఉన్న సొమ్లగూడ, తుమ్మగూడ, టెమ్లగూడ గ్రామాల్లో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. సుమారు 43 మందికి వైద్య పరీక్షలు ని ర్వహించి మాత్రలు అందించారు. రక్తపూతలు సేకరించారు. వర్షాకాలంలో సంక్రమించే వ్యా ధులతో అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ మె స్రం సోము, హెచ్‌ఏలు శంకర్, వసంత్, ఏఎన్‌ఎంలు సంఘమిత్ర, సుమలత పాల్గొన్నారు.
బెదిరింపులకు పాల్పడిన ఒకరి రిమాండ్
ఆదిలాబాద్‌టౌన్: డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడిన విద్యానగర్‌కు చెందిన మణిశేఖర్‌పై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కు మార్ తెలిపారు. పట్టణంలోని బొక్కల్‌గూడకు చెందిన మహ్మద్ అబ్దుల్ వసీమ్ 2024 డిసెంబర్‌లో రాంలీలా మైదానంలో ఎగ్జిబిషన్ మేనేజర్‌గా వ్యవహరించాడు. మణిశేఖర్ వసీమ్‌ను బెదిరించి రూ.2లక్షలు ఇవ్వాలని, లేదంటే హైకోర్టుకు వెళ్లి ఎగ్జిబిషన్ బంద్ చేయిస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు రూ.20వేలు ఇచ్చాడు. మిగితా డబ్బులు తర్వాత ఇవ్వాలని, లేదంటే చంపుతానని హెచ్చరించాడు. దీంతో బాధితుడు మంగళవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి మణిశేఖర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
జన్నారం: మండలంలోని కిష్టాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆకుల అనన్య బుధవారం మంచిర్యాలలో నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు రాజన్న తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సేనో బీఫోర్ ఇట్స్ టూ లేట్ అనే కామిక్ వ్యాస రచన, కామిక్ డ్రాయింగ్ పోటీలో పాల్గొని ప్రతిభ కనబర్చినట్లు ఆయన పేర్కొన్నారు. గెలుపొందిన విద్యార్థినిని, గైడ్ టీచర్స్ దాముక కమలాకర్, మణెమ్మను డీఈవో ఎస్.యాదయ్య, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

వైద్యానికి కావొద్దు వాగు అడ్డంకి