
తెలంగాణ వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు
● వర్సిటీ చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ● రెండో స్నాతకోత్సవంలో పట్టాల ప్రదానం ● 113 మందికి గోల్డ్‌మెడల్స్.. 157 మందికి డాక్టరేట్‌లు అందజేత
తెయూ(డిచ్‌పల్లి): రాష్ట్రం పేరుతో ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని వర్సిటీ చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. తెయూ రెండో స్నాతకోత్సవాన్ని(కా న్వొకేషన్) బుధవారం డిచ్‌పల్లి క్యాంపస్‌లో అట్ట హాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమైన తెయూ.. నేడు ఏడు విభాగాలు, 24 ఉప విభా గాలుగా 31 కోర్సులతో కొనసాగుతోందన్నారు. తెయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు మాట్లాడుతూ వర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
బంగారు పతకాలు.. డాక్టరేట్ పట్టాలు
2014 నుంచి 2023 వరకు 15 విభాగాల్లో 130 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపగా, దరఖాస్తు చేసుకున్న 113 మందికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యఅతిథి ప్రొఫెసర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా స్నాతకోత్సవంలో బంగారు పతకాలు అందజేశారు. 2017 నుంచి 2025 జూన్ వరకు ఏడు విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేసుకున్న 157 మంది పరిశోధకులకు పీహెచ్‌డీ(డాక్టరేట్) పట్టాలను అందజేశారు.