
వ్యాపారి ఇంటి ఎదుట రైతుల ఆందోళన
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని బీట్‌బజార్‌కు చెందిన విశ్వనాథం అనే వ్యాపారి ఇంటి ఎదుట బుధవారం లక్సెట్టిపేట, దండేపల్లి మండలాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణానికి చెందిన శ్రీధర్ లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల రైతుల వద్ద ధాన్యం కొనుగోలు, ఇతర లావాదేవీలు కొనసాగిస్తుండేవాడు. ఈక్రమంలో పలువురి వద్ద అప్పులు తీసుకుని చెల్లించలేకపోయాడు. కొద్ది రోజుల క్రితం ఐపీ పేరుతో నోటీసులు పంపుతున్నాడనే సమాచారంతో అప్పు ఇచ్చిన రైతులు ఈ నెల 8 న శ్రీధర్ ఇంటిఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు ఫిర్యాదు చేయాలని చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. వ్యా పారి విశ్వనాథం కూడా శ్రీధర్‌కు డబ్బులు అప్పుగా ఇచ్చాడు. దీంతో దండేపల్లిలో ఉన్న భూమి అప్పుకింద రాయించుకున్నాడని, అట్టి భూమిని బాధితులందరికీ పంచాలని బుధవారం రైతులు విశ్వనాథం ఇంటిఎదుట ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై గోపతి సురేష్ రైతులతో మాట్లాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు.