Sakshi News home page

అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం●

Published Sun, Apr 14 2024 11:50 PM

నివాళులర్పిస్తున్న అధికారులు, సిబ్బంది - Sakshi

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలో ఈ నెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు ని ర్వహించనున్నట్లు లీడింగ్‌ ఫైర్‌ అధికారులు సంపత్‌, సతీశ్‌ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఫైర్‌ స్టేషన్‌ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి వారోత్సవాలు ప్రారంభించారు. అగ్నిమాపక శకటాలు, యంత్ర సామగ్రిని ప్రదర్శించారు. వివిధ అగ్ని ప్రమాదాల నివారణ కార్యక్రమాల్లో అమరులైన సిబ్బంది కి నివాళులర్పించారు. అనంతరం వారు మా ట్లాడుతూ వారం రోజులపాటు అగ్ని ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన ప్రాథమిక చ ర్యలు, నియంత్రణ విధానాలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేయనున్నట్లు తెలి పారు. ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, మార్కెట్‌ ఏరియాలతోపాటు ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులు, విద్యుత్‌ వినియోగదారులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది నాగేశ్వర్‌, విలాస్‌, కుమారస్వామి, మహేశ్‌, జనార్దన్‌, తులసీదాస్‌, రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement