ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

Published Thu, Nov 16 2023 6:14 AM | Last Updated on Thu, Nov 16 2023 6:14 AM

రికార్డులు పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో
 - Sakshi

దహెగాం(సిర్పూర్‌): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారాం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలోని రికార్డులు పరిశీలించారు. అనంతరం వ్యాక్సినేషన్‌ సెంటర్లను తనిఖీ చేశారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా ఆరోగ్య కేంద్రం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట వైద్యాధికారి స్పందన, సిబ్బంది ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement