‘ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులు’ | Sakshi
Sakshi News home page

‘ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులు’

Published Thu, Nov 9 2023 12:16 AM

ఎమ్మెల్సీకి పుష్పగుచ్ఛం అందిస్తున్న నాయకులు - Sakshi

కాగజ్‌నగర్‌రూరల్‌: కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్య అందుతుందని ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి అన్నారు. కాగజ్‌నగర్‌ మండలం బోరిగాం పాఠశాలను బుధవారం సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలి తాలు సాధిస్తున్నాయని పేర్కొన్నారు. మన ఊరు– మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎటుకూరి శ్రీనివాస్‌రావు, భిక్షపతి, రతన్‌గైన్‌, శ్రావణ్‌కుమార్‌, ప్రధానోపాధ్యాయులు ముంతాజ్‌ బేగం, ఉమాకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement