మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

ధర్నా చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు - Sakshi

యువ విజ్ఞానిని సద్వినియోగం చేసుకోవాలి

మంచిర్యాలటౌన్‌: యువత సైన్స్‌, టెక్నాలజీలో ముందుకుసాగాలనే ఉద్దేశంతో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే ఇస్రో ‘యువ విజ్ఞాని’ పేరిట యువిత అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈవో వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థి దశ నుంచే బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు క్యాచ్‌ యంగ్‌ నినాదంతో యువికా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఇస్రో మంచి అవకాశాన్ని కల్పించిందని, శిక్షణ పొంది శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరారు. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఏప్రిల్‌ 3వ తేదీలోగా http:// www. isro. gov. in/ YUVIKA. html లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న విద్యార్థులకు మే 15వ నుంచి 26వ తేదీ వరకు ‘సైన్స్‌, పరిశోధన అంశాలపై అన్ని వసతులు కల్పించి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ అవగాహన, అంతరిక్ష పరిశోధనా రంగాల్లో ఆసక్తి పెంచేందుకు దోహదపడుతుందని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి మధుబాబును 9849550200 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

దండేపల్లి: మహిళలు స్వయం ఉపాధి శిక్షణ పొంది ఆర్థికాభివృద్ధి సాధించాలని డీఆర్‌డీవో శేషాద్రి అన్నారు. దండేపల్లి ఆదర్శ వయోజన విద్యాకేంద్రంలో పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ సౌజన్యంతో మహిళలకు నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మంగళవారం సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రుణాలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ గౌరవాధ్యక్షుడు ప్రకాశం, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం, జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి వెంకటరమణ, దళిత అభివృద్ధి అధికారి రవీందర్‌రెడ్డి, బీసీ వెల్ఫేర్‌ అధికారి వినోద్‌కుమార్‌, తహసీల్దార్‌ హనుమంతరావు, డీఆర్పీలు జనార్దన్‌, వెంకటేశ్వర్లు, తిరుపతి, అశోక్‌రావు, శిక్షకురాలు ఉమాదేవి మహిళలు పాల్గొన్నారు.

మంచిర్యాలఅగ్రికల్చర్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, చైర్మన్‌, కార్యదర్శులను తొలగించాలని మంగళవా రం కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ.. లక్షల మంది నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్లలో తిండీతిప్పులు, నిద్రాహారాలు మాని చదువుతున్నారని, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలి పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చైర్మన్‌, కార్యదర్శులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం ఇచ్చారు. జిల్లా కమిటీ సభ్యులు చెవుటు మల్లేష్‌, అభినవ్‌, వెంకటేశ్‌, రాకేశ్‌ తదితరులున్నారు.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ను తొలగించాలని ధర్నా

Read latest Komaram Bheem News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top