హోంగార్డుల సేవలు కీలకం
ఖమ్మంక్రైం: పోలీసుశాఖలో హోంగార్డు ఆఫీసర్ల సేవలు కీలకంగా నిలుస్తున్నాయని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో సీపీ కేక్ కట్ చేశాక విధినిర్వహణలో అత్యంత ప్రతిభ చూపిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులు పోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా పాటుపడాలని సూచించారు. వీరి సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు మహేష్, సుశీల్‌సింగ్, నర్సయ్య, సీఐ, ఆర్‌ఐలు రాజిరెడ్డి, సురేష్, కామరాజు, సాంబశివరావు, నాగుల్‌మీరా, హోంగార్డు వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు.
పోలీసు కమిషనర్ సునీల్‌దత్


