ఓటమే విజయానికి నాంది
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
గురుకులాల రాష్ట్ర కార్యదర్శి సైదులు
వైరారూరల్: ప్రతీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటే భవిష్యత్ విజయాలకు సోపానాలుగా నిలుస్తాయని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి బి.సైదులు తెలిపారు. ఓడిపోయిన వారు అధైర్యపడకుండా మరింత కష్టపడితే విజయాలు సొంతమవుతాయని చెప్పారు. వైరా మండలం రెబ్బవరం బీసీ గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు గురువారం ముగిశాయి. ఉమ్మడి జిల్లా నుండి 12 బాలికల గురుకుల పాఠశాలలు, కళాశాలల నుండి 520 మంది విద్యార్థినులు పాల్గొనగా విజేతలకు సైదులు బహుమతులు అందజేసి మాట్లాడారు.
విజేతలు వీరే..
అండర్–14 విభాగం ఖో–ఖోల్లో ముసలిమడుగు, వాలీబాల్‌లో టేకులపల్లి జట్లు విజేతలుగా నిలవగా, ఓవలాల్ చాంపియన్ షిప్ ముసలిమడుగు గురుకుల విద్యార్థినులు గెలుపొందారు. డిస్కస్‌త్రోలో భానుతేజ(వైరా) గెలుపొందింది. అండర్ –19 కబడ్డీల్లో లంకపల్లి, వాలీబాల్‌లో ఎర్రుపాలెం విజేతలుగా నిలిచాయి. ఈ విభాగంలో ఓవరలాల్ చాంపియన్ షిప్‌ను లంకపల్లి విద్యార్థినులు దక్కించుకున్నారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.రాధిక, అధ్యాపకులు పాల్గొన్నారు.


