
మహిళల సమగ్రాభివృద్ధే లక్ష్యం
భద్రాచలం/బూర్గంపాడు: మహిళల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు, భద్రాచలంలో శుక్రవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావులతో కలిసి ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా మహిళా సంఘాల సభ్యు లకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేశారు. అలాగే, భద్రాచలంలో రామాలయం చుట్టు పక్కల జరుగుతున్న మాడవీధుల విస్తరణ పనులను పరిశీ లించారు. తొలుత గిరిజన్ భవన్‌లో మహిళలు తయా రు చేసిన బిస్కెట్లను కొనుగోలు చేశారు. ఈ కార్య క్రమాల్లో మంత్రి మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల మహిళలకు గత ప్రభుత్వం పావలా వడ్డీ రుణాలు చెల్లించకుండా ఇబ్బంది పెడితే తాము అధికారంలోకి వచ్చాక రూ. 875 కోట్లు చెల్లించామని తెలిపారు.
వైఎస్సార్ ఆశయ స్ఫూర్తితో..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయ స్ఫూర్తితో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని పట్టుదలతో పనిచేస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. పినపాక నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్ట్‌తో 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. గోదావరి ముంపు బాధితులకు మెరక ప్రాంతంలో స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులు, వైదిక కమిటీ సభ్యులకు మంత్రి శ్రీనివాసరెడ్డి సూచించారు.
పినపాకలో 40 వేల ఎకరాలకు సీతారామ జలాలు
రామాలయ అభివృద్ధికి ప్రణాళిక
సిద్ధం చేయాలి
ఇందిర మహిళా శక్తి సంబరాల్లో
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి