
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అంతరాలయంలో మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించిన అర్చకులు నిత్యకల్యాణ ఘట్టాన్ని జరిపారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.