
చకచకా సింథటిక్ ట్రాక్ నిర్మాణం
జిల్లాలో అథ్లెటిక్స్ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేలా సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మిస్తున్న సింథటిక్ ట్రాక్ మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ట్రాక్
నిర్మాణానికి రూ.8.35 కోట్లు కేటాయించగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 400 మీటర్స్ ట్రాక్ కోసం మొదటి దశ పనులు పూర్తి చేయగా.. ఒకటి, రెండో రోజుల్లో కాంక్రీట్ పనులు పూర్తవుతాయి. తొలుత ట్రాక్ ప్రతిపాదిత ప్రదేశంలో తవ్వి కంకరను నింపి రోలింగ్ చేశారు. ఆపై భారీ వర్షం వచ్చినా ట్రాక్‌పై నీరు నిలవకుండా చుట్టూ డ్రెయినేజీలు
నిర్మిస్తున్నారు. ట్రాక్ నిర్మాణం వేగంగా జరుగుతుండడం.. నాలుగు నెలల్లో అందుబాటులోకి రానండడంతో అథ్లెటిక్స్ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందనుంది. – ఖమ్మం స్పోర్ట్స్