
మంటల్లో టాటా ఏస్ దగ్ధం
నేలకొండపల్లి: ఇంజన్ వేడెక్కడానికి తోడు షార్ట్ సర్క్యూట్ కారణంగా వాహనం కాలిపోయింది. హైదరాబాద్‌కు చెందిన టాటా ఎస్ డ్రైవర్ ఆజాద్ శుక్రవారం ఖమ్మం నుంచి కోదాడ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లేందుకు నేలకొండపల్లి మీదుగా బయలుదేరారు. ఈక్రమంలో పైనంపల్లి టోల్‌గేట్ వద్ద ఇంజన్ వేడికి తోడు షార్టు సర్క్యూట్ జరగడంతో మంటలు మొదలయ్యాయి. దీంతో డ్రైవర్ వాహనాన్ని పక్కన నిలిపి దిగగానే టాటా ఏస్ పూర్తిగా కాలిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు.