
పెద్దాస్పత్రిలో కార్డియాలజిస్ట్ నియామకం
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గుండె సంబంధిత చికిత్సలు యథా విధిగా కొనసాగుతున్నాయి. ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్‌గా డాక్టర్ సీతారాం డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తించారు. అయితే, గత నెలలో ఆయన డిప్యూటేషన్ గడువు ముగియడంతో చికిత్సలు నిలిచిపోయాయి. ఆస్పత్రిలో రూ.కోట్ల వ్యయంతో క్యాథల్యాబ్ ఏర్పాటుచేయగా ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి గుండె సంబంధిత సమస్యలతో వచ్చే వారికి చికిత్స అందేది. డాక్టర్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురుకాగా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని ఆస్పత్రి అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో డాక్టర్ సీతారాంనే తిరిగి డిప్యూటేషన్‌పై తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో ఆయన విధుల్లో చేరగా 2డీ ఎకో, యాంజియోగ్రాం, స్టంట్లు, ఫేస్‌మేకర్ తదితర వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి.
యథావిధిగా గుండె సంబంధిత చికిత్సలు