
బీజేపీ అధ్యక్షుడిపై వ్యాఖ్యలకు నిరసన
ఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం ఖమ్మంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా కోటేశ్వరరావు, శ్రీధర్ మాట్లాడుతూ దళితుల గౌరవాన్ని బీజేపీ ఎల్లవేళలా కాపాడుతుందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. నాయకులు కోటమర్తి సుదర్శన్, గెంటెల విద్యాసాగర్, నున్న రవికుమార్, ప్రతాప్, చిన్నికృష్ణ, శ్రీకృష్ణ, శ్రీని వాస్, రాజేష్, విజయరెడ్డి, సరస్వతి, మణి, రుద్ర ప్రదీప్, చంద్రశేఖర్, సతీష్, సాయిరాం, వీరభద్రం, నరేష్, నారాయణ, మల్లేశ్వరి, వంశీ, అనిత, జ్వాల పాల్గొన్నారు.
నిరసనలో ఘర్షణ
బీజేపీ నాయకులు నిరసన తెలిపే క్రమాన డిప్యూటీ సీఎం భట్టిపై విమర్శలు చేయగా, అక్కడకు చేరిన కొందరు కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. ఈక్రమంలోనే ఇరువర్గాల మధ్య తోపులాట జరిగినట్లు సమాచారం. అక్కడ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్‌పై దాడి చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఆ సమయాన పోలీసులు ఇరువర్గాల ను పంపించారు. ఘటనలో శ్రీధర్‌కు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించడంతో పలువురు పరామర్శించారు. అయితే, పోలీసుల పట్టింపులేని తనంతోనే ఈ ఘటన జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు.