ఇన్‌చార్జ్‌ ఏఎస్‌డబ్ల్యూఓకు జాతీయ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జ్‌ ఏఎస్‌డబ్ల్యూఓకు జాతీయ పురస్కారం

Jul 14 2025 4:39 AM | Updated on Jul 14 2025 4:39 AM

ఇన్‌చ

ఇన్‌చార్జ్‌ ఏఎస్‌డబ్ల్యూఓకు జాతీయ పురస్కారం

చింతకాని: మండలంలోని నాగులవంచ సమీకృత బాలుర వసతి గృహం సంక్షేమాధికారి, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి సహాయ అధికారి (ఏఎస్‌డబ్ల్యూఓ), మధిర ఇన్‌చార్జ్‌ కొత్త వెంకటేశ్వరరావు తెలుగు వెలుగు జాతీయ గౌరవ పురస్కారాన్ని హైదరాబాద్‌ త్యాగరాయ గానసభలో శనివారం అందుకున్నారు. తెలుగు – వెలుగు సాహితీ వేదిక, కాళోజీ తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఆధ్వర్యంలో షెడూ్‌య్ల్డ్‌ కులాల విద్యార్థుల అభ్యున్నతికి, సామాజిక సేవకు గాను ఆయనకు అవార్డు అందజేశారు. శ్రీ విశ్వకళా విరాట్‌, బతుకమ్మ తల్లి గ్రంథకర్త, గిన్నీస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గ్రహీత డాక్టర్‌ వంగాల శాంతికృష్ణ చేతుల మీదుగా ఆయన పీవీ నర్సింహారావు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సహచర ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు వెంకటేశ్వరరావును అభినందించారు.

యాప్‌ ఓపెన్‌ చేస్తే

డబ్బులు మాయం

రఘునాథపాలెం: ఓ విద్యార్థి వాట్సప్‌నకు వచ్చిన లింక్‌ ద్వారా యాప్‌ ఓపెన్‌ చేయగానే బ్యాంక్‌ ఖాతాలో ఉన్న డబ్బులు మాయం అయ్యాయి. బాధితుడి ఫిర్యాదుపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్‌ షరీఫ్‌ తెలిపారు. కారేపల్లి మండలం కుక్కలతండాకు చెందిన అజ్మీరా సిద్ధార్థ రఘునాథపాలెంలో ఉంటున్నాడు. గత డిసెంబర్‌ 26న తన ఫోన్‌ వాట్సాప్‌నకు ఓ యాప్‌ మెసేజ్‌ వచ్చిందని దాన్ని ఓపెన్‌ చేయగానే తన ఖాతాలో నిల్వ ఉన్న నగదు రూ.70 వేలు పోయినట్లు మెసేజ్‌ వచ్చిందని, వెంటనే సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేస్తే ఖాతాను హోల్డ్‌ చేశారని బాధితుడు తెలిపాడు. సైబర్‌ క్రైమ్‌ అధికారుల సూచన మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

మహిళకు తీవ్ర గాయాలు

చింతకాని: మండలంలోని మత్కేపల్లి తుమ్మలమ్మ వాగు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం నగరానికి చెందిన సుగుణకు తీవ్ర గాయాలయ్యాయి. సుగుణ కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనంపై ఏపీలోని పెనుగంచిప్రోలు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి ఖమ్మం వస్తుండగా తుమ్మలమ్మ వాగు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. సుగుణ తలకు తీవ్ర గాయాలు కావటంతో సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ నాగుల్‌మీరా, ఏఎస్‌ఐ లక్ష్మణ్‌ ఆమెను 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

ఉత్తమ టీటీ కోచ్‌కు అవార్డు

ఖమ్మంస్పోర్ట్స్‌: రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన ఆదివారం హైదరాబాద్‌లో ఉత్తమ టేబుల్‌ టెన్నిస్‌ కోచ్‌గా జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి, కోచ్‌ వీవీ సాంబమూర్తికి ఉత్తమ కోచ్‌గా అవార్డు అందించారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో అవార్డు అందుకున్న కోచ్‌గా సాంబమూర్తి నిలిచారు. ఆయనకు అవార్డు రావడంపై సంఘం జిల్లా అధ్యక్షులు బాలసాని విజయ్‌కుమార్‌, ఉపాధ్యక్షులు ఉప్పల్‌రెడ్డి, డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌కుమార్‌, జంగాల సునీల్‌, శ్రీధర్‌, ప్రవీణ్‌కుమార్‌, చలపతి, షేక్‌ మజ్జాహర్‌, జోజిచాకో, రాజేశ్‌, రెడ్డిసాయి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

వరద తగ్గింది..

బురద మిగిలింది

భద్రాచలంటౌన్‌: భద్రాచలం వద్ద గోదావరికి భారీ వరద వచ్చి తగ్గింది. సుమారు 42 అడుగులకు చేరుకోవడంతో స్నానఘట్టాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. వరద తగ్గడంతో ఆదివారం కొంత మేరకు స్నానఘట్టాలపై నీరు తగ్గింది. కానీ బురద మిగిలిపోయింది. దీంతో స్నానాలు ఆచరించేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడక్కడా భక్తులే బురదను తొలగించుకుని స్నానాలు చేశారు.

ఇన్‌చార్జ్‌ ఏఎస్‌డబ్ల్యూఓకు జాతీయ పురస్కారం1
1/2

ఇన్‌చార్జ్‌ ఏఎస్‌డబ్ల్యూఓకు జాతీయ పురస్కారం

ఇన్‌చార్జ్‌ ఏఎస్‌డబ్ల్యూఓకు జాతీయ పురస్కారం2
2/2

ఇన్‌చార్జ్‌ ఏఎస్‌డబ్ల్యూఓకు జాతీయ పురస్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement