
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ఖమ్మంక్రైం: నగరంలోని టూటౌన్ పరిధిలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే ఉపేందర్ (28) తన ఇంట్లో కుట్టుమిషన్‌కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారకస్థితికి చేరుకున్న అతడిని బంధువులు జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తమకు ఇంకా ఫిర్యాదు రాలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు.
ద్విచక్రవాహనాన్ని
ఢీకొట్టిన ట్రాక్టర్
కారేపల్లి: ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టంతో దంపతులకు తీవ్రగాయా లైన ఘటన మండలంలోని భాగ్యనగర్‌తండాలో ఆదివారం చోటుచేసుకుంది. నెక్కొండ పట్టణానికి చెందిన విష్ణువర్దన్, సహన దంపతులు ఇల్లెందులో నివాసం ఉంటున్నారు. వీరు ఇల్లెందు నుంచి ద్విచక్రవాహనంపై కారేపల్లి మీదుగా ఖమ్మం వస్తుండగా భాగ్యనగర్‌తండా వద్ద కుక్క అడ్డురావటంతో రోడ్డుపై కిందపడ్డారు. వెనుకాల ఉంచి ట్రాక్టర్ వచ్చి దంపతుల మీది నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 ద్వారా ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. విష్ణువర్దన్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. ఎస్‌ఐ గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దంపతులకు తీవ్ర గాయాలు