
అరుణాచలం యాత్రలో విషాదం
ఖమ్మంఅర్బన్: తమిళనాడులోని అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం వాసి మృతి చెందాడు. ఖమ్మం 4వ డివిజన్ వేణుగోపాల్‌నగర్‌కు చెందిన శ్రీ అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ సభ్యుడు యర్రోజు చిన సుబ్బాచారి(50), దేవస్థాన మాజీ చైర్మన్ కొండల్‌తో పాటు వీరన్న, మణికంఠ తదితరులు రెండు రోజుల క్రితం స్వామి దర్శనానికి కారులో బయలుదేరారు. అరుణాచలం సమీపానికి చేరగా వీరి కారును ఎదురుగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్న సుబ్బాచారి తలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకా కొండల్, వీరన్న, మణికంఠ తదితరులకు గాయాలయ్యాయి. ఈమేరకు సుబ్బాచారి మృతదేహాన్ని శనివారం ఖమ్మం తీసుకురాగా, పలువురు నివాళులర్పించాక అంత్యక్రియలు పూర్తిచేశారు. కార్పొరేటర్లు దండా జ్యోతిరెడ్డి, నాగండ్ల కోటి, పల్లెబోయిన భారతిచంద్రం, అభయ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ బొల్లి కోమరయ్య తదితరులు పాల్గొన్నారు.
మార్గమధ్యలో ఖమ్మం వాసి మృతి