
ఆదాయం వచ్చే పంటలపై దృష్టి పెట్టాలి
కొణిజర్ల: రైతులు సంప్రదాయ పంటల స్థానంలో అధిక ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్‌పామ్, వక్క తదితర పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ సహకార, మార్కెటింగ్ పట్టు పరిశ్రమల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కొణిజర్ల మండలం అంజనాపురంలో శనివా రం నిర్వహించిన ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్ ను ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగు పై రైతుల్లో ఆసక్తి పెరుగుతోందని తెలిపారు. అయితే, విత్తనాల కోసం ఇతర దేశాలపై ఆధార పడాల్సి వస్తుండగా, కల్తీని మొక్కలు పెద్దయ్యే వరకు గుర్తించలేకపోతున్నామని చెప్పారు. ఈనేపథ్యాన గోద్రెజ్ కంపెనీ బాధ్యులు దేశంలోనే తొలిసారి కొణిజర్లలో సీడ్ గార్డెన్ ఏర్పాటుకు ముందుకొచ్చారని తెలిపారు. ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌లో ఒప్పందం చేసుకోవడంతో ముందడుగు పడిందన్నారు. అంజనాపురంలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని ఈ ఏడాది నవంబర్ నాటికి సిద్ధం చేయాలని, రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.
ఫ్యాక్టరీ ప్రారంభించకపోతే దున్నిస్తాం..
వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ మాట్లాడుతూ అన్ని సహాయ, సహకారాలు అందుతున్నందున నవంబర్ నాటికి కంపెనీ ప్రతినిధులు ఫ్యాక్టరీని ప్రారంభించాలని సూచించారు. లేనిపక్షంలో రైతుల వద్ద నుంచి తీసుకున్న భూమిని తానే దగ్గరుండి దున్నిస్తానని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడగా డీఏఓ డి.పుల్లయ్య, జిల్లా ఉద్యానవన శాఖాఽధికారి ఎం.వీ. మధుసూదన్‌రావు, ఉద్యాన శాస్త్రవేత్త ఎన్.వీ ప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, బొర్రా రాజశేఖర్, గోద్రెజ్ మార్కెటింగ్ మేనేజర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మొక్కలతో ఆరోగ్యం
ఖమ్మంఅర్బన్/రఘునాథపాలెం: పర్యావరణ పరిరక్షణే కాక అందరం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం 8వ డివిజన్ వైఎస్సార్ నగర్‌లోని రెండెకరాల స్థలంలో శనివారం వనమహోత్సవంలో భాగంగా ఆర్కానట్(వక్క) మొక్కలు నాటారు. కలెక్టర్ అనుదీప్, మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్‌తో కలిసి మొక్కలు నాటాక మంత్రి మాట్లాడుతూ కోనోకార్పస్ మొక్కలతో మంచి జరగడం లేదనే కథనాల నేపథ్యాన వాటిని తొలగించి మహాగని, ఆర్కానట్ మొక్కలు నాటనున్నామని తెలిపారు. అనంతరం రఘునాథపాలెం మండలం కే.వీ.బంజరలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కే.వీ.బంజర నుంచి కొత్తతండా క్రాస్ వరకు రూ.1.30 కోట్లతో నిర్మించే రోడ్డు పనులకు కలెక్టర్ అనుదీప్‌తో కలిసి శంకుస్థాపన చేశాక మంత్రి మాట్లాడారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, ఆత్మకమిటీ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, కేఎంసీ ఉద్యాన అధికారి బెల్లం రాధిక, కార్పొరేటర్లు లకావత్ బాలాజీ, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, కమర్తపు మురళితో పాటు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, దొబ్బల సౌజన్య, రావూరి సైదబాబు, తాతా రఘురాం, తుపాకుల ఏలగొండస్వామి, వాంకుడోత్ దీపక్ తదితరులు పాల్గొన్నారు.
నవంబర్ నాటికి అంజనాపురంలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఆదాయం వచ్చే పంటలపై దృష్టి పెట్టాలి