
జిల్లా మీదుగా ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక రైలు
ఖమ్మం మామిళ్లగూడెం: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేలా ఏర్పాటుచేసిన ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక రైలు జిల్లా మీదుగా ప్రయాణం సాగిస్తుందని ఐఆర్‌ిసీటీసీ అసిస్టెంట్ మేనేజర్ పీ.వీ.వెంకటేష్ తెలిపారు. ఖమ్మం శుక్రవరం ఆయన మాట్లాడుతూ ఈనెల 19న మొదలయ్యే హైదరాబాద్‌లో యాత్ర 26వ తేదీ వరకు సాగుతుందని వెల్లడించారు. యాత్రలో భాగంగా తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమా రి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు తదితర క్షేత్రా ల సందర్శన ఉంటుందని, సాధారణ బోగీలో రూ. 14,100, థర్ఢ్ ఏసీలో రూ.22,300, సెకండ్ ఏసీలో రూ.29,200గా టికెట్ ధర నిర్ణయించామని తెలిపారు. ఈ రైలుకు జిల్లాలోని ఖమ్మం, మధిరలో హాల్టింగ్ ఉన్నందున జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టికెట్ల బుకింగ్, ఇతర వివరాల కోసం 97013 60701, 92814 95845, 92814 95843 , 92810 30749 నంబర్లలో సంప్రదించాలని వెంకటేష్ సూచించారు. ఈ సమావేశంలో ఉద్యోగులు ఎం.శ్రీకాంత్, కె.ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు .
ఈనెల 19నుంచి 26వ తేదీ వరకు టూర్