భద్రాద్రి జిల్లా ఆత్మ డీపీడీగా నియామకం
ఖమ్మంవ్యవసాయం/కూసుమంచి: కూసుమంచి వ్యవసాయ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ) బి.సరితకు డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆమెను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ (డీపీడీ)గా నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం సరిత విధుల నుంచి రిలీవ్ అయి భద్రాద్రి జిల్లాలో బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయాన ఖమ్మం రైతు శిక్షణ కేంద్రం ఏడీఏ ఎం.సతీశ్‌కు కూసుమంచి ఏడీఏగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, సరిత సుదీర్ఘకాలం ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో టెక్నికల్ ఏడీఏ గానే కాక ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయాధికారిగా విధులు నిర్వర్తించారు.
ఇంజనీరింగ్ విద్యార్థినికి చేయూత
ఖమ్మంగాంధీచౌక్: వైరా మండలం పుణ్యపురికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని చెరుకూరి నివేదిత చదువు కోసం ఖమ్మం లయన్స్ క్లబ్ బాధ్యులు శుక్రవారం రూ.15 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కె.జగదీష్‌బాబు, ఎం.దుర్గానాగేశ్వరరావుతో పాటు కృష్ణమూర్తి, డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు, విశ్వేశ్వరరావు, డీపీసీ.రావు, హనుమంతరావు, కృష్ణమూర్తి, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యాన ఇంజనీర్ల దినోత్సవంలో భాగంగా సీనియర్ ఇంజనీర్లు వేముల హన్మంతరావు, కొల్లూరి కృష్ణమూర్తిని సన్మానించారు.
కూసుమంచి ఏడీఏ సరితకు పదోన్నతి