
శరవేగంగా సింథటిక్ ట్రాక్ నిర్మాణం
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రూ.8.35 కోట్ల వ్యయంతో అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం నిర్మిస్తున్న సింథటిక్ ట్రాక్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 400 మీటర్ల ట్రాక్ కోసం మొదటి దశ పనులను పూర్తి చేయగా, కాంక్రీట్ పనులు పదిరోజుల్లో పూర్తికానున్నా యి. అంతేకాక భారీ వర్షం పడినా నీళ్లు నిలవకుండా ట్రాక్ చుట్టూ కాల్వ తీశారు. ఈమేరకు ట్రాక్ పనులను అథ్లెటిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె.సారంగపాణి గురువారం పరిశీలించి కాంట్రాక్టర్‌కు సూచనలను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం మూడు సింథటిక్ ట్రాక్‌లు అందుబాటులో ఉండగా, ఖమ్మంలో నాలుగో ట్రాక్ సిద్ధమవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, కోచ్‌లు పాల్గొన్నారు.