
మరింత మెరుగ్గా వ్యవసాయ విద్యుత్ సరఫరా
ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరాను మెరుగుపర్చాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) టి.మధుసూదన్ సూచించారు. ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ రాజుచౌహాన్‌తో కలిసి ఖమ్మంలో ఆయన గురువారం విద్యుత్ అధికారులు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. జిల్లాలో విద్యుత్ సరఫరాపై, పన్నుల వసూళ్లపై చర్చించాక డైరెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. వ్యవసాయ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే కాక అవసరమైన చోట లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతు చేయాలని తెలిపారు. ఇదే సమయాన విద్యుత్ ఉద్యోగులు విధినిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, డీఈలు నంబూరి రామారావు, సీహెచ్.నాగేశ్వరరావు, ఎల్.రాములు, శ్రీనివాస్, బద్రుపవార్, ఈ.వెంకటేశ్వర్లు, ఎస్‌ఏఓ శ్రీధర్, ఏడీఈలు, ఏఏఓలు పాల్గొన్నారు.