
చాలా సంతోషంగా ఉన్నాం
నేలకొండపల్లికి చెందిన పసుమర్తి శ్రీనివాస్–లావణ్య దంపతులు ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సంతానం ఒక్కరు చాలని నిర్ణయించుకున్నారు. వీరికి కుమారుడు శ్రీ లలిత్ సౌరి ఉన్నాడు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, పిల్లలకు కనీస అవసరాలు తీర్చడం కోసం అధిక మొత్తాలను వెచ్చించాల్సి రావడం వంటి సమస్యలను గుర్తించి ఒక్కరు చాలనకున్నామని, ఒక్క బాబుతో సంతోషంగా జీవనం సాగిస్తున్నామని ఆ దంపతులు తెలిపారు. ఇదే మాదిరి ఆర్థిక భారం పెరగడంతో చాలా మంది దంపతులు ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనడంపై ఆసక్తి చూపించడం లేదు. విద్య, వైద్యం, ఆహారం, బట్టలు తదితర అవసరాల కోసం భారీగా ఖర్చు పెరుగుతుంది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలలో ఇదో పెద్ద సమస్యగా మారుతోంది. దీంతో పాపైనా, బాబైనా ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు.
నా కష్టం పిల్లలు పడకూడదని..
మాది పెద్ద కుటుంబం. ఎనిమిది మంది సభ్యులం. ఇంత మందిని పోషించడం అమ్మనాన్నలకు ఇబ్బందిగా ఉండేది. చాలా రోజులు ఆహారం లేక ఉపవాసంతోనే నిద్రించేవాళ్లం. ఆ పరిస్థితి నా పిల్లలకు ఎదురవ్వొద్దని నా చిన్నతనంలోనే నిర్ణయించుకున్నా. నాకు రామనాథంతో పెళ్లయ్యాక భర్తను ఒప్పించి కొడుకై నా, కూతురైనా ఒక్కరే చాలనుకున్నాం. కుమార్తె జన్మించింది. ఉన్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ, రెక్కల కష్టంతో కుమార్తెను సుఖంగా పోషించుకుంటున్నాం. ఆమెను ప్రయోజకురాలిని చేయాలన్నదే మా లక్ష్యం. – చింత భారతి – రామనాధం, కుంజవారిగూడెం, ఇల్లెందు మండలం
●

చాలా సంతోషంగా ఉన్నాం