
బైక్‌పై 10వేల కి.మీ. ఆధ్యాత్మిక యాత్ర
సత్తుపల్లి: దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను ద్విచక్ర వాహంనంపై చుట్టి రావాలని యువకుడు ఆ కోరిక నెరవేర్చుకున్నాడు. సత్తుపల్లి ద్వారకాపురి కాలనీకి చెందిన పురోహితుడు ఉప్పల ప్రవీణ్ శాస్త్రి చాలాకాలంగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలని నిర్ణయించుకున్నాడు. తొలుత పలువురు మిత్రులు కూడా కలిసొస్తామని చెప్పినా ఆతర్వాత వెనుకడుగు వేయడంతో బంధువైన శరత్‌కుమార్ వర్మతో కలిసి యాత్ర ప్రారంభించాడు. చెరో బైక్‌పై హైదరాబాద్‌లో ప్రయాణం ఆరంభించిన వారు నెల వ్యవధిలో 10వేల కి.మీ. మేర ప్రయాణించారు. ఈ క్రమంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహా రాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, హరిద్వార్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా మీదుగా ఏపీలోని శ్రీకాకుళం నుంచి తిరిగి తెలంగాణలోకి తిరిగి ప్రవేశించినట్లు ప్రవీణ్ తెలిపారు. చార్‌ధామ్‌తో పాటు ఉత్తర, దక్షిణ భారతదేశంలోని అన్ని ముఖ్య క్షేత్రాలను సందర్శించిన ఆయనను సృజన సాహితీ సమాఖ్య బాధ్యులు బుధవారం సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, మధుసూదన్‌రాజు, నాగేశ్వరరావు, నర్సింహారావు, రామిశెట్టి శ్రీనివాసరావు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.