
రాష్ట్ర ఫుట్‌బాల్ టోర్నీకి జిల్లా జట్టు ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్‌లో బుధవారం నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి జూ నియర్ బాలికల ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొనేందుకు జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఎంపిక చేసిన ఈ జట్టు మంగళవా రం ఉదయం రామకృష్ణాపూర్ బయలు దేరింది. ఈ సందర్భంగా క్రీడాకారులను ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.ఆదర్శ్‌కుమార్, రైల్వే సూపరిటెండెంట్ సుభాస్ చంద్రబోస్, డిప్యూటీ సూపరిటెండెంట్ ఎం.రాజేంద్ర, ట్రాక్ ఇంజనీర్ దేవిప్రియ, జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు రాజ్ ఆదినారాయణ అభినందించారు. ఈకార్యక్రమంలో క్రీడాకారులు కిషోన్, రమణ, కోచ్‌లు నోయల్‌జాక్సన్, అశ్రిత్, మాధురి, శిరీష పాల్గొన్నారు.