
సార్వత్రిక సమ్మెకు యూఎస్‌పీసీ మద్దతు
ఖమ్మం సహకారనగర్: దేశవ్యాప్తంగా బుధవా రం నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెక ఉపాధ్యా య సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) జిల్లా స్టీరింగ్ కమిటీ మద్దతు ప్రకటించింది. ఖమ్మంలోని యూటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు పారుపల్లి నాగేశ్వరరావు, టి.వెంగళరావు మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్ల రద్దు, ధరల నియంత్రణ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు కనీస వేతనాలు, పని గంటల తగ్గింపునకు చేపడుతున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. అలాగే, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, ఇంటి అద్దెను ఆదాయ పన్ను నుండి మినహాయించాలని డిమాండ్ చేశారు. నాయకులు రంజాన్, ఏ.వీ.నాగేశ్వరావు, నాగమల్లేశ్వరరా వు, రాంబాబు, కె.వెంకటేశ్వరావు, మల్సూర్, దామోదర్, రామోజీ, జి.వెంకటేశ్వరావు పాల్గొన్నారు.
ఏకలవ్య విద్యాలయాల్లో
ప్రవేశానికి స్పాట్ కౌన్సెలింగ్
భద్రాచలంటౌన్: ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హ్యూమాటిక్స్ గ్రూపుల్లో సీట్లు ఖాళీగా ఉండగా, గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 2024–25లో ఎస్సెస్సీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ నెల 11న చర్లలోని ఏకలవ్య విద్యాలయంలో జరిగే స్పాట్ కౌన్సెలింగ్‌కు అన్ని ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్స్‌తో హాజరు కావాలని పీఓ సూచించారు.
వసతి గృహాల్లో
ప్రవేశాలు పెరగాలి
ఖమ్మంమయూరిసెంటర్:వసతిగృహాల్లో కల్పిస్తు న్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించి ఎక్కు వ మంది విద్యార్థులు చేరేలా ఉద్యోగులు కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కస్తాలసత్యనారాయణ సూచించారు. ఖమ్మం లోని అంబేద్కర్ భవన్‌లో వసతిగృహ సంక్షేమాధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. అన్ని ఎస్సీ వసతిగృహాల్లో సీట్లు ఖాళీగా ఉన్నందున విస్తృత ప్రచారం చేయాలని తెలిపా రు. ఏదైనా హాస్టల్‌లో సంఖ్య పెరిగితే సమీప హాస్టల్‌కు పంపించాలని చెప్పారు. అలాగే, విద్యార్థుల వివరాలను ఈనెల 15లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. తెలంగాణ సంక్షేమాధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రుక్మారావు, ఏఎస్‌డబ్ల్యూఓలు పాల్గొన్నారు.
భూసేకరణపై
అభ్యంతరాల స్వీకరణ
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు నూతన రైల్వే లైన్ ఏర్పాటుతో భూములు కోల్పోనున్న రైతులతో మండలకేంద్రంలోని రైతు వేదికలో అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఉషాశార ద భూములు కోల్పోతున్న రైతుల వివరాలు వెల్ల డించారు. ఈ అంశంపై అభ్యంతరాలు ఉంటే సమర్పించాలని సూచించారు. ఐపీటీ రైల్వే డీటీ వీరభద్రనాయక్, ఆర్‌ఐ ఎస్ రవికుమార్, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి తదతరులు పాల్గొన్నారు.
‘బాల పురస్కార్’కు
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన బాలలు, స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రధాన మంత్రి రాష్టీయ్ర బాల పురస్కార్ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్‌రెడ్డి తెలిపారు. నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభాపాటవాలు, ఆటలు, కళలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్యసాహసం అంశాల్లో అవార్డులు అందిస్తారని వెల్లడించారు. ఐదేళ్లు మొదలు 18 ఏళ్ల లోపు బాలబాలికలతో పాటు ఏడేళ్ల లోపు బాలబాలికల సంరక్షణకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల బాధ్యులు https:// awards. gov. in వెబ్‌సైట్ ద్వారా ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆతర్వాత దరఖాస్తు ప్రతులను కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో అందజేయాలని డీడబ్ల్యూఓ రాంగోపాల్‌రెడ్డి తెలిపారు.