
ఏకాగ్రతతో విధులు నిర్వర్తించాలి
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ డ్రైవర్లు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఏకాగ్రతతో విధులు నిర్వర్తించాలని ట్రాఫిక్ ఏసీపీ శ్రీని వాసులు సూచించారు. విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఖమ్మం రీజియన్ పరిధిలోని డ్రైవర్లకు విడదల వారీగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యాన మంగళవారం ఇచ్చిన శిక్షణలో ఏసీపీ మాట్లాడారు. ప్రమాదాలకు కారణమయ్యే మద్యపానానికి డ్రైవర్లు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం మానసిక ఒత్తిడిని అధిగమించడంపై బ్రహ్మకుమారి గీత అవగాహన కల్పించారు. ఆర్టీసీ డిప్యూటీ రీజనల్ మేనేజర్ మల్లయ్య, ఖమ్మం, మణుగూరు డీఎంలు దినేష్‌కుమార్, శ్యాంసుందర్‌తో పాటు ఉద్యోగులు వినాయకరావు, సురేశ్ పాల్గొన్నారు.
బాల కార్మికుడి గుర్తింపు
ఖమ్మంఅర్బన్: ‘ఆపరేషన్ ముస్కాన్’లో భాగంగా ఖమ్మంలోని పలు షాపుల్లో మంగళవారం వివిధ శాఖల అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇల్లెందు క్రాస్‌లోని ఒక షాప్‌లో బాలుడు పని చేస్తుండడాన్ని గుర్తించి యజమానిపై కేసు నమోదు చేశామని ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా సంబంధిత శాఖల సమన్వయంతో తనిఖీలు చేపడుతున్నామని వెల్లడించారు.
ఆర్టీసీ డ్రైవర్ల శిక్షణ తరగతుల్లో
ఏసీపీ శ్రీనివాసులు