
‘విద్య ప్రాధాన్యతను మరిచిన ప్రభుత్వం’
ఖమ్మంమయూరిసెంటర్: సామాజిక, ఆర్థిక, అసమానతలు కలిగిన నేటి సమాజంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా ప్రాధాన్యతను గుర్తించడం లేదని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృధ్దీ విమర్శించారు. ఖమ్మంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రభుత్వ విద్యారంగం విధ్వంసానికి గురైందని తెలంగాణ సమాజం రేవంత్‌రెడ్డిని గెలిపించిందని తెలిపారు. కానీ కేసీఆర్ బాటలోనే రేవంత్‌రెడ్డి ప్రయాణిస్తుండడం ఆందోళనలకు గురి చేస్తుందన్నారు. ఎన్నికల సమయాన విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయిస్తామని చెప్పినా ఆ పరిస్థితి లేదని ఆరోపించారు. పీడీఎస్‌యూ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఆవుల అశోక్, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి శిరోమణి మాట్లాడుతూ పాలకుల విద్యావ్యతిరేక విధానాలను నిరసిస్తూ విద్యార్థులు ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలనికోరారు. పీడీఎస్‌యూ జిల్లా కార్య దర్శి వెంకటేష్, నాయకులు శశి, కార్తీక్, యశ్వంత్, సందీప్, సాధిక్, సురేష్, పుదీల పధ్వీ, నాసిర్, అశోక్ ,శ్రీను, పేర్ల వెంకటేష్, ప్రసాద్, పాషా, ప్రాణవ్, స్టాలిన్, నరేందర్, అనూష, అఖిల పాల్గొన్నారు.