
పాత వంతెనపై రాకపోకల పునరుద్ధరణ
ఖమ్మంక్రైం: ఖమ్మంలోని మున్నేటిపై కాల్వొడ్డు వద్ద ఉన్న పాత వంతెన మీదుగా శనివారం నుంచి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. తీగల వంతెన నిర్మాణం కారణంగా కాల్వొడ్డు పాత వంతెన మూతపడడం, అక్కడి చప్టాపైకి వరద చేరి కొట్టుకుపోవడం.. ప్రకాశ్‌నగర్ వంతెన దూరం కావడంతో వాహనాలన్నీ రాపర్తినగర్ బ్రిడ్జి వద్దకు వస్తుండడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ అంశంపై ‘సాక్షి’లో శనివారం ‘రహదారి కష్టాలు’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు కాల్వొడ్డు పాత వంతెన మీదుగా ద్విచక్ర వాహనాలను అనుమతించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం రాకపోకలు మొదలుకాపోవడంతో రాపర్తినగర్ బ్రిడ్జిపై కాస్త భారం తగ్గినట్లయింది.