
రహ‘దారి’ కష్టాలు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలో కాల్వొడ్డు వద్ద మున్నేటిపై పాత బ్రిడ్జి మీదుగా రాకపోకలు నిలిచి పోవడం, ఆ పక్కనే లోలెవల్ చపాపైకి వరద నీరు చేరగా వాహనాలను అనుమతించకపోవడం జిల్లా కేంద్రంలో వాహనదారులకష్టాలకు కారణమవుతోం ది. ఖమ్మం నుంచి సూర్యాపేట, వరంగల్, కోదాడ, జగ్గయ్యపేట వైపు వెళ్లేందుకు మున్నేటిపై మూడు చోట్ల బ్రిడ్జిలు నిర్మించారు. కాల్వొడ్డు వద్ద వందేళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి ప్రక్కనే ప్రస్తుతం తీగల వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో పాత బ్రిడ్జి మీదుగా వాహనాల రాకపోకలను కొ న్నాళ్లుగా నిలిపివేశారు. ప్రకాశ్‌నగర్‌లోఇంకో బ్రిడ్జి ఉన్నప్పటికీ అది దూరాభారం కావడంతో వాహనదారులంతా రాపర్తినగర్ బ్రిడ్జి వచ్చివెళ్తున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం ఇక్కడ తీవ్ర రద్దీ నెలకొని గంటల తరబడి ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి.
నత్తనడకన తీగల వంతెన నిర్మాణం
మున్నేటిపై ఉన్న మూడు బ్రిడ్జిల్లో కాల్వొడ్డు బ్రిడ్జి కీలకంగా నిలుస్తోంది. ఇదినగరంలోని ప్రధాన ప్రాం తాలను కలుపుతూ నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. అయితే ఈ బ్రిడ్జి పక్కనే రూ.180 కోట్ల వ్యయంతో తీగల వంతెన నిర్మిస్తున్నారు. ఈ పనులకు ఆటంకం ఎదురుకావొద్దని పాత బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. అయితే, తీగల వంతెన నిర్మాణం 2023లో మొదలుపెట్టగా 2026 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు 45శాతం పనులే పూర్తయ్యాయి. ప్రస్తుతం వర్షాలు మొదలవడంంతో పనులు నత్తనడకన సాగుతుండగా.. పాత బ్రిడ్జి పక్కన లోలెవల్ చప్టాపైకి ఇటీవల వరద చేరి ద్విచక్రవాహనాలు వచ్చివెళ్లేందుకు అనువుగా ఉన్న రోడ్డు కాస్త కొట్టుకుపోయింది. దీంతో వాహనదారులంతా నగరంలోకి రావాలన్నా.. వెళ్లాలన్నా అవస్థ పడక తప్పడంలేదు.
రాపర్తినగర్‌పైనే భారమంతా..
కాల్వొడ్డు బ్రిడ్జి మూసివేయడడం.. ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి దూరం కావడంతో ఖమ్మం నుంచి ఇతర ప్రాంతాలకు వచ్చివెళ్లే వాహనాలన్నీ రాపర్తినగర్ బ్రిడ్జి వైపునకు వస్తున్నాయి. సహజంగా రద్దీ ఉండే ఈ బ్రిడ్జిపై ఇప్పుడు మరింత భారం పడడంతో ఉదయం, సాయంత్రం కిలోమీటర్ల మేర వాహనాలు బారులు దీరుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు, భారీ వాహనాలన్నీ వస్తుండడం.. బ్రిడ్జి వెడల్పు చాలా తక్కువగా ఉండడంతో సమస్యకు కారణమవుతోంది. భారీ వాహనాలు, కంటైనర్లు వచ్చినప్పుడు బ్రిడ్జి దాటే వరకు అటు కరుణగిరి, ఇటు రాపర్తినగర్ వైపు మిగతా వాహనాలను నిలిపివేస్తుండడంతో వాహనదారులు కష్టాలు మరింత పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం రెండు లారీలు ఢీకొనడంతో సుమారు రెండు గంటల పాటు వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చివరకు కొన్ని వాహనాలను దారి మళ్లించి జెడ్పీ సెంటర్ మీదుగా ప్రకాశ్‌నగర్ బ్రిడ్జి వైపు పంపించారు.
మున్నేటిపై కాల్వొడ్డు బ్రిడ్జి మూసివేత
ఫలితంగా భారమంతా
రాపర్తినగర్‌పైనే...
వాహనాల రద్దీతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్
ప్రమాదాలు జరుగుతున్నాయి..
వాహనాలన్నీ రాపర్తినగర్ వైపు వస్తుండడంతో రద్దీ పెరి గింది. త్వరగా వెళ్లాలని ఆటోలు, ద్విచక్ర వాహనదారులు చిన్నచిన్న సందుల్లోకి వెళ్తూ ప్రమాదాలు బారిన పడుతున్నారు. పాత బ్రిడ్జిని పునరుద్ధరించి ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించాలి.
– సైదా, సీపీఐ నాయకుడు
పాత బ్రిడ్జిపై అనుమతించాలి..
తీగల వంతెన నిర్మాణం పేరుతో పాత బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య పెరిగింది. రాపర్తినగర్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోంది. కాల్వొడ్డు వద్ద పాత బ్రిడ్జిపై వాహనా లు అనుమతిస్తేనే సమస్య పరిష్కారమవుతుంది.
– వై.విక్రమ్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి, సీపీఎం

రహ‘దారి’ కష్టాలు

రహ‘దారి’ కష్టాలు

రహ‘దారి’ కష్టాలు