
ఇన్ఫోసిస్‌కు ఎస్‌బీఐటీ విద్యార్థుల ఎంపిక
ఖమ్మం సహకారనగర్: ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ లిమిటెడ్‌కు ఖమ్మంలోని ఎస్‌బీఐటీ కళాశాల విద్యార్థులు ఐదుగురు ఎంపికయ్యారు. ఈమేరకు కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ శుక్రవారం వారిని అభినందించి మాట్లాడారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్యాంపస్ ఫూల్ డ్రైవ్‌లో తమ విద్యార్థులు ఎంపికవగా.. వారికి ఆరు నెలల శిక్షణలో రూ.3.60 లక్షల చొప్పున, ఆతర్వాత రూ.9 లక్షల పైచిలుకు వార్షిక వేతనం అందుతుందన్నారు.
కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ ధాత్రి, అకడమిక్ డైరెక్టర్లు గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, ఏ.వీ.వీ.శివప్రసాద్, జె.రవీంద్రబాబు, ఎన్.శ్రీనివాసరావు, టీపీఓ ఎన్.సవిత, కోఆర్డినేటర్ జి.ప్రభాకర్ పాల్గొన్నారు.