
పురపాలికల శివార్లలో ప్రజల ఇక్కట్లు
● రహదారులు సరిగ్గా లేక వర్షం వస్తే సమస్య తీవ్రం ● మంచిగా ఉన్నచోట తవ్వకాలతో గుంతలు
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఏర్పాటు సమయాన శివారు గ్రామాలను విలీనం చేయడం పరిపాటి. తద్వారా ఇంటి పన్నులు
పెరగడంతో పాటు ప్రజలపై ఇతర భారం పడుతున్నా సౌకర్యాల కల్పనలో మాత్రం పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగానే
వ్యవహరిస్తున్నారు. ఇతర సౌకర్యాలు,
వసతుల మాటేమో కానీ కనీసం అంతర్గత రహదారులు నిర్మించకపోవడంతో చిన్నపాటి వర్షం వస్తే చాలు బురదమయమై అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి ఉండడం లేదు. ఖమ్మం కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో బుధవారం ‘సాక్షి’ పరిశీలించగా పలు సమస్యలు వెలుగు చూశాయి.