
నడక సాగదు
మెరుగుపడవు..
●
అభివృద్ధికి దూరంగానే...
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కార్పొరేషన్ పరిధి ప్రధాన ప్రాంతాల్లో రోడ్లను ఆధునికీకరించినా విలీన, శివారు ప్రాంతాల్లో ఆ పరిస్థితి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విలీన పంచాయతీలు ఖమ్మంలో విలీనమై దశాబ్దకాలం దాటినా ఇంకా సరైన రోడ్లు, డ్రెయినేజీలు లేకపోవడం గమనా ర్హం. వర్షాకాలంలో మట్టి రోడ్లు బురదమయమై రోడ్డుపై నడిచే పరిస్థితి ఉండడం లేదు. కార్పొరేషన్ పరిధిలో బీటీ రోడ్లు 11.39 కి.మీ., సీసీ రోడ్డు 172.32 కి.మీ. ఉండగా.. మట్టి రోడ్డు 23.46 కి.మీ., మెటల్ రోడ్డు 27.20 కిలోమీటర్ల మేర ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి.
చినుకుపడితే చిత్తడే..
ఖమ్మంలో నివసించేందుకు వస్తున్న జనాభా పెరుగుతుండడంతో నివాసాలు, కాలనీలోనూ పెరుగుతున్నాయి. గత నాలుగేళ్లలో శివారు, విలీన పంచాయతీల్లో గృహాల సంఖ్య రెట్టింపయింది. కానీ ఆయా కాలనీలకు రోడ్ల సౌకర్యం కల్పించకపోవడంతో మట్టి రోడ్లతో జనం అవస్థ పడుతున్నారు. దీనికి తోడు మిషన్ భగీరథ, యూజీడీ పైపులైన్ల పేరుతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లను ధ్వంసం చేశారు. పైపులైన్లు వేశాక సక్రమంగా పూడ్చక పోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నా రు. గత ఏడాది మున్నేటి వరద ముంచెత్తిన కాలనీ ల్లో ధ్వంసమైన రోడ్లను చాలాచోట్ల ఇప్పటికీ మర మ్మతు చేయకపోవడం అదే పరిస్థితి నెలకొంది.