
పేదల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే..
ఖమ్మంమయూరిసెంటర్: పేదల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు తెలిపారు. ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించిన ఘనత సీపీఐకే దక్కుతుందని చెప్పారు. ఇదే సమయాన కాలనీల్లో వసతుల కల్పన, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందే వరకు పోరాడుతామని తెలిపారు. కాగా, రాష్ట్రప్రభుత్వం ఎన్నికల సమయాన ఇచ్చిన హామీలు అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, నాయకులు మహ్మద్ మౌలానా, ఎస్.కే.జానీమియా, మహ్మద్ సలాం, బీ.జీ.క్లెమెంట్, పోటు కళావతి, మేకల శ్రీనివాసరావు, పగడాల మల్లేష్, అజ్మీరా రామ్మూర్తి, తాటి నిర్మల, యానాలి సాంబశివరెడ్డి, వరదా నర్సింహారావు, ఎస్.కే.సైదా, బోడా వీరన్న పాల్గొన్నారు.