
వర్షాకాలంలో సమస్య
వైరా: వైరా మున్సిపాలిటీ ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతుండగా... డంపింగ్ యార్డు సమస్య మాత్రం కొలిక్కి రావడం లేదు. మున్సిపాలిటీ పరిధి లోని 20వార్డుల నుంచి 10 టన్నుల మేర చెత్త సేకరిస్తుండగా, వైరా సమీపంలోని తల్లాడ మండలం కొడవటిమెట్ట వద్ద మూడెకరాలను డంపింగ్ యార్డుకు కేటాయించారు. కానీ అక్కడకు నాలుగు కి.మీ.కు పైగా దూరం ఉండడంతో వాహనాల డ్రైవర్లు మార్గమధ్యలోనే చెత్త వేస్తున్నారు. ఒకవేళ వెళ్లినా వర్షాకాలంలో వైరా రిజర్వాయర్ అలుగులు పొంగితే దారులు మూసుకుపోయాయి. ఇటీవల స్టేజీ పినపాక వంతెన సమీపాన చెత్త వేస్తూ నిప్పు పెడుతుండగా పొగతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి.