
మారిస్తేనే ఫలితం
కల్లూరు: కల్లూరు మున్సిపాలిటీలో చెత్త డంపింగ్‌కు సమస్యలు ఎదురవుతున్నాయి. ఎన్నెస్పీ కెనాల్ పక్కన డంపింగ్ యార్డ్ ఉండగా.. నిత్యం ఎనిమిది ట్రాక్టర్లు, రెండు ఆటోల్లో అక్కడి డంపింగ్ యార్డ్, కంపోస్ట్ షెడ్లకు తరలిస్తున్నారు. అయితే, డంపింగ్ యార్డ్‌లో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక్కడకు సమీపంలోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కళాశాల ఉండడంతో విద్యార్థులు, వాకర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్‌ను దూరప్రాంతానికి మారిస్తేనే సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు. అయితే, ఇంకోచోటకు మార్చేలా ప్రతిపా దించామని ఈఓ నాగేశ్వరరావు తెలిపారు.