బీఆర్‌ఎస్‌ సమన్వయకర్తల నియామకం | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ సమన్వయకర్తల నియామకం

Published Thu, Apr 18 2024 2:05 PM

-

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ పరిధి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటన విడుదల చేశారు. వీరు ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రచారంలో పాల్గొనడంతో పాటు కేడర్‌ను సమన్వయం చేయాల్సి ఉంటుంది. పాలేరుకు ఎమ్మెల్సీ తాతా మధు, ఖమ్మంకు డీసీసీబీ మాజీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, వైరాకు తాళ్లూరి జీవన్‌, మధిరకు మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, కొత్తగూడెంకు ఉప్పలపాటి వెంకటరమణ, సత్తుపల్లికి బీరెడ్డి నాగచంద్రారెడ్డి, అశ్వారావుపేటకు కోనేరు చిన్నిని నియమించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement