స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా భద్రాద్రి తలంబ్రాలు | Sakshi
Sakshi News home page

స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా భద్రాద్రి తలంబ్రాలు

Published Thu, Apr 18 2024 2:05 PM

అయోధ్య మందిరం, ఇతర చిత్రాలతో రూపొందించిన స్టాంప్‌లు  - Sakshi

ఖమ్మంగాంధీచౌక్‌: భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ తలంబ్రాలను స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా భక్తులకు చేరవేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏటా మాదిరిగానే ఈసారి కూడా భద్రాచలం ఆలయ అధికారులు తపాలా శాఖ ద్వారా తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చేలా బుకింగ్‌ స్వీకరించారు. అంతరాలయంలో అర్చన కల్యాణ తలంబ్రాలకు రూ.450గా, ముత్యాల తలంబ్రాలకు రూ.150 ధర నిర్ణయించగా ఖమ్మం తపాలా డివిజన్‌ పరిధిలో 800కు పైగా బుకింగ్‌లు వచ్చాయి. ఈమేరకు భక్తులకు చిరునామాలకు రెండు, మూడు రోజుల్లో తలంబ్రాల పంపాణీ మొదలుపెట్టే అవకాశముంది.

అయోధ్య రామమందిరం చిత్రంతో తపాలా స్టాంప్‌లు

ఖమ్మంగాంధీచౌక్‌: అయోధ్యలో ఇటీవల ప్రారంభించిన రామమందిరం చిత్రంతో రూపొందించిన ఆరు ప్రత్యేక స్మారక తపాలా బిల్లలను తపాలా శాఖ శ్రీరామనవమి రోజున అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్టాంప్‌ల ను జనవరి 18న ప్రధాని నరేంద్రమోదీ విడుదల చేయగా, ఖమ్మం తపాలా డివిజన్‌కు ఇవి బుధవారం చేరాయి. అయోధ్య రామమంది రంతో పాటు గణనాథుడు, హన్మంతుడు, జటాయువు, శబరి తదితర చిత్రాలు ముద్రించిన రూ.5 విలువైన ఆరు స్టాంప్‌ల అసలు విలువ రూ.30కాగా, ఆరింటితో కూడిన ప్యాక్‌ ధర రూ.100గా నిర్ణయించారు. ఖమ్మం తపాలా డివిజన్‌కు 900 ప్యాక్‌లను కేటాయించిన అధికారులు ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం ప్రధాన తపాలా కార్యాలయాలకు 300 చొప్పు న సరఫరా చేశారు. ఆయా కార్యాలయాలతో పాటు సబ్‌, బ్రాంచ్‌ పోస్టాపీస్‌ల ద్వారా విక్రయించనున్నారు. కాగా, తపాలా శాఖలో స్టాంప్‌ సేకరణ అకౌంట్‌ కలిగిన వారికి నేరుగా పంపిస్తుండగా, గుర్తుగా దాచుకునేందుకు మాత్రమే వీలున్న వీటిని ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేయొచ్చు.

Advertisement
 
Advertisement